Thu Jan 29 2026 06:06:58 GMT+0000 (Coordinated Universal Time)
ఉపరాష్ట్రపతి రాజీనామాపై ఆ మూడున్నర గంటల్లో ఏం జరిగింది?
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ట్వీట్ సంచలనం కలిగించింది

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ట్వీట్ సంచలనం కలిగించింది. జగ్దీప్ ధన్‌ఖడ్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. నిబంధనలు, ప్రొటోకాల్‌ను ధన్‌ఖడ్ పాటించేవారని జైరాం రమేష్ తెలిపారు. జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాకు ఆరోగ్యపరమైన కారణాలు అని అనిపించడం లేదని జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు.
బీఏసీ సమావేశానికి...
నిన్నజరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశానికి జేపీ నడ్డా, రిజిజు ఉద్దేశపూర్వకంగా హాజరు కాలేదని జైరాం రమేష్ ట్వీట్ లో తెలిపారు. ఈ విషయంలో ధన్‌ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారన్న జైరాం రమేష్ నిన్న మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4:30 గంటల మధ్య ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.ధన్‌ఖడ్ రాజీనామాకు లోతైన కారణాలున్నాయని జైరాం రమేష్ అనడం సంచలనంగా మారింది.
Next Story

