Sat Jan 31 2026 06:21:57 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరు చేరుకున్న రాహుల్
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు బెంగళూరుకు చేరుకున్నారు

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు బెంగళూరుకు చేరుకున్నారు. మరికాసేపట్లో జరగబోయే ప్రమాణ స్వీకారానికి వీరు హాజరవుతున్నారు. విపక్ష నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఆరుగురు సిద్ధూ బ్యాచ్...
మొత్తం ఎనిమిది మంది మంత్రులకు అవకాశం కల్పించారు. వీరిలో ఆరుగురు సిద్ధరామయ్య అనుకూలురు కావడమే విశేషం. కేబినెట్ లో దళిత సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ఉన్నారు. డీకే శివకుమార్ వర్గం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారు. తర్వాత విస్తరణలో డీకే వర్గానికి అవకాశం కల్పించనున్నారు.
Next Story

