Fri Dec 05 2025 15:58:33 GMT+0000 (Coordinated Universal Time)
Sonia Gandhi : నేడు సోనియా గాంధీ నామినేషన్
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె రాజ్యసభకు ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈరోజు రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయనున్నారు. ఈరోజు జైపూర్ వెళ్లనున్న సోనియా గాంధీ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించనున్నారు.
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు...
సోనియా గాంధీ వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా వెళ్లనున్నారు. ప్రియాంక గాంధీ ఈసారి రాయబరేలి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈరోజు రాజస్థాన్ లో సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేయనుండటంతో భారత్ జోడో న్యాయయాత్రకు రాహుల్ గాంధఈ విరామం ప్రకటించారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆమె పెద్దల సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Next Story

