Sat Jan 31 2026 18:51:25 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ సిరిసిల్ల పర్యటన రద్దు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. ఆగస్టు 2వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించాల్సి ఉంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. ఆగస్టు 2వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. సిరిసిల్లలో జరిగే నిరుద్యోగుల గర్జనకు రాహుల్ హాజరు కావాల్సి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు రాహుల్ పర్యటన ఖరారు అయింది. అయితే రాహుల్ తెలంగాణ పర్యటన రద్దయినట్లు ఏఐసీీసీ వర్గాలు వెల్లడించాయి.
ఈడీ దాడులు...
వరసగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి తనకు, సోనియా గాంధీకి నోటీసులు రావడంతో పాటు వరదల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆగస్టు 2న సిరిసిల్లలో జరిగే సభకు హాజరు కావడం లేదు. అయితే రాహుల్ గాంధీ మళ్లీ ఎప్పుడు పర్యటించేది త్వరలో తేదీని ఏఐసీసీ ప్రకటించనుంది. ఆగస్టు 2వ తేదీ మాత్రం సిరిసిల్లలో జరిగే నిరుద్యోగ గర్జన సభ మాత్రం రద్దయినట్లు ఏఐసీపీ ప్రకటించింది.
Next Story

