Sun Mar 08 2026 04:58:06 GMT+0530 (India Standard Time)
నేడు కర్ణాటకలోకి రాహుల్ పాదయాత్ర
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు కర్ణాటకకు చేరుకోనుంది

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు కర్ణాటకకు చేరుకోనుంది. తమిళనాడు, కేరళలో దాదాపు 22 రోజుల పాటు రాహుల్ యాత్ర కొనసాగింది. రేపు కర్ణాటకలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఈరోజు ఉదయం 9గంటలకు చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట్ వద్ద ఊటీ - కాలికట్ వద్ద కర్ణాటకలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది. పీసీీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాహుల్ కు స్వాగతం పలకనున్నారు.
ఎల్లుండి బ్రేక్...
ఇప్పటి వరకూ 467 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేశారు. కర్ణాటకలో రాహుల్ పాదయాత్ర 19 రోజుల పాటు కొనసాగనుంది. కర్ణాటకలో 450 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. ఏడు జిల్లాల మీదుగా యాత్ర కొనసాగనుంది. అక్బోబరు 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ తన పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. కర్ణాటక లో పర్యటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ సాగుతుంది.
Next Story

