Sat Dec 06 2025 01:53:43 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జమ్మూకాశ్మీర్ లోకి యాత్ర
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించనుంది

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించనుంది. ఈ నెల 26వ తేదీన శ్రీనగర్ లో మెగా ర్యాలీని నిర్వహించనున్నారు. 30న భారత్ జోడో యాత్ర ముగింపు సభ ఉంటుంది. ఈ సభకు దాదాపు ఇరవై మంది రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి. వారు యాత్ర ముగింపు సభకు హాజరవుతారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. దాదాపు ఐదు నెలల పాటు రాహుల్ భారత్ యాత్ర కొనసాగినట్లయింది.
ఐదు నెలల పాటు...
గత ఏడాది సెప్టంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమయిన భారత్ జోడోయాత్ర ఈ నెల 30వ తేదీన కాశ్మీర్ లో ముగియనుంది. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి భారత్ జోడో యాత్ర కొనసాగింది. యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పార్టీ కార్యాకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా రాహుల్ యాత్రలో పాల్గొనడం విశేషం. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం రాహుల్ చేసిన ఈ సాహస యాత్ర ఏ మేరకు ఉపయోగపడుతుందన్నది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి కొంత మేర బలం తెచ్చిపెట్టిందనే అంటున్నారు.
Next Story

