Wed Mar 18 2026 16:44:03 GMT+0530 (India Standard Time)
నేడు చెన్నైకి రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తమిళనాడులో పర్యటించనున్నారు. చెన్నైలోని ఆయన పర్యటన సాగనుంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తమిళనాడులో పర్యటించనున్నారు. చెన్నైలోని ఆయన పర్యటన సాగనుంది. స్టాలిన్ పై రచించిన పుస్తకాన్ని రాహుల్ గాంధీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంతో పాటు స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కూడా రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
రాష్ట్రపతి ఎన్నిక....
ప్రధానంగా వీరి మధ్య రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరిగే అవకాశముంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని పోటీకి దింపడంపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఈసారి అభ్యర్థిని పోటీకి దింపాలన్న యోచనలో ఉంది.
Next Story

