Sat Jan 31 2026 18:50:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మరోసారి ఈడీ ఎదుటకు రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైెరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైెరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు. వాస్తవానికి శనివారమే హాజరు కావాల్సి ఉన్నా తాను సోమవారం హాజరవుతాని రాహుల్ విజ్ఞప్తిని ఈడీ అధికారులు అంగీకరించారు. ఇప్పటికే నేషనల్ హెరాల్ద్ కేసులో రాహుల్ గాంధీని మూడు రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. రోజుకు దాదాపు తొమ్మిది గంటల పైనే ప్రశ్నించారు.
రాష్ట్రపతి వద్దకుకు...
మరోసారి హాజరు కావాలని అధికారులు కోరారు. ఈరోజు ఈడీ అధికారుల ఎదుటకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించాల్సి ఉందని చెబుతున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అగ్నిపథ్ తో పాటు, రాహుల్ గాంధీ ఈడీ విచారణపై రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.
Next Story

