Fri Jan 30 2026 04:47:19 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : యూపీలో రాహుల్ పర్యటన.. వారికి భరోసా
ఉత్తరప్రదేశ్ లో తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు

ఉత్తరప్రదేశ్ లో తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. వారి కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇటీవల భోలే బాబా సత్సంగం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తొక్కిసలాటలో 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి ఈరోజు ఉదయం హత్రాస్ కు బయలుదేరి రాహుల్ గాంధీ మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
పార్టీ అండగా ఉంటుందని...
జరిగిన ఘటన దురదృష్టకరమన్న రాహుల్ గాంధీ దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలకు పరిమితికి మించి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలిగఢ్ లో తొక్కిసలాటలో గాయపడి కోలుకుంటున్న వారిని కూడా రాహుల్ గాంధీ పరామర్శించారు.
Next Story

