Sat Dec 06 2025 09:45:32 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్కు చుక్కెదురు
సూరత్ కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది

సూరత్ కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువునష్టం కేసులో తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలంటూ ఆయన వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. మోదీ పేరుతో తమను దూషించారంటూ రాహుల్ పై గతంలోనే సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
రెండేళ్ల జైలు శిక్షపై...
దీనిపై స్టే విధించాలంటూ సూరత్ కోర్టును ఆశ్రయించగా దానిని తోసిపుచ్చింది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుతో రాహుల్ పార్లమెంటు పదవిపై కూడా లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. దీంతో రాహుల్ గాంధీ దీర్ఘకాలంగా ఉంటున్న తన బంగళాను కూడా ఖాళీ చేసిన సంగతి తెలిసిందే.
Next Story

