Sat Dec 07 2024 23:36:56 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : రాహుల్ గాంధీ వీడియో వైరల్.. ఇలా చేసేవేంటయ్యా సామీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందన్న ధీమాతో ఉన్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఆయన సభలకు హాజరవుతున్న ప్రజలను చూసి రాహుల్ ఈ అంచనాకు వచ్చినట్లుంది. లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతుండటంతో మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని రాహుల్ గాంధీ పదే పదే బహిరంగ సభల్లో చెబుతున్నారు.
ప్రచారం చేస్తుండగా...
అదే సమయంలో ఆయన ఉత్తర్ప్రదేశ్ లో ఒక సభలో తలపై నీళ్లు పోసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఉత్తర్ప్రదేశ్ లోని రుద్రపూర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ఎండ వేడిమి ఎక్కువగా ఉండటంతో బాటిల్ తో నీరు తాగి మిగిలిన నీటిని తలపై పోసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్ లో నిన్న 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోయింది. దీంతో ఎండ వేడమికి తట్టుకోలేక రాహుల్ నీటిని తలపై పోసుకునే వీడియో వైరల్ గా మారింది.
Next Story