Thu Dec 18 2025 07:35:31 GMT+0000 (Coordinated Universal Time)
Priyanka Gandhi : వాయనాడ్ లో భారీ మెజారిటీ దిశగా ప్రియాంక
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గంలో పూర్తి ఆధిక్యతతో కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గంలో పూర్తి ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ప్రియాంక విజయం దాదాపు ఖాయమయింది. ఇప్పటికే తన సమీప ప్రత్యర్థి కంటే మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసి తొలిసారి విజయాన్ని చవిచూస్తున్నారు.
దక్షిణాదిలో పోటీ చేసి...
తర్వాత స్థానంలో కమ్మునిస్టు పార్టీ అభ్యర్థి ఉండగా, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉన్నారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ విజయాన్ని అందుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వాయనాడ్ ఇక కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిందని, దక్షిణాదిన గాంధీ కుటుంబాన్ని ఆదరిస్తుందని చెప్పడానికి ఈ విజయమే కారణమని అంటున్నారు.
Next Story

