Wed Jan 21 2026 02:28:49 GMT+0000 (Coordinated Universal Time)
జోడో యాత్రకు ఊరట
కర్ణాటక హైకోర్టులో కాంగ్రెస్ కు ఊరట లభించింది. భారత్ జోడో యాత్రలో కాపీరైట్ కేసును హైకోర్టు కొట్టివేసింది

కర్ణాటక హైకోర్టులో కాంగ్రెస్ కు ఊరట లభించింది. భారత్ జోడో యాత్రలో కాపీరైట్ కేసును హైకోర్టు కొట్టివేసింది. బెంగళూరు కింది కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయాలన్న కింది కోర్టు ఆదేశాలను రద్దు చేసింి. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ సినిమాకు సంబంధించిన వీడియో, ఆడియోలు ఉపయోగించారని, ఇది కాపీరైట్ ఉల్లంఘనేనని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కాపీరైట్ యాక్ట్ కింద...
దీంతో కాపీరైట్ యాక్ట్ కింద భారత్ జోడో యాత్రకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని ఆదేశించింది. సినిమాలో పాటలను ఉపయోగించారన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. స్వల్ప మార్పులు చేసి తమ సినిమా పాటలను ఉపయోగించారన్న వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. దీంతో కాంగ్రెస్ కు ఊరట లభించింది.
Next Story

