Thu Jan 29 2026 11:58:29 GMT+0000 (Coordinated Universal Time)
Priyanka Gandhi : నేను పోటీ చేయనది ఎందుకంటే?
లోక్సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయడం లేదో తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

లోక్సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయడం లేదో తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. తాను కూడా రాహుల్ తో పాటు మరొక చోట ఎన్నికల బరిలో ఉంటే బీజేపీకి లాభం చేకూరుతుందని ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. అందుకే తాను పోటీకి దూరంగా ఉన్నారని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ప్రచారం చేయడం కోసం...
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థలకు మద్దతుగా ప్రచారం చేయడం కోసం తాను పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని ప్రియాంక గాంధీ తెలిపారు. తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేసే రాయబరేలి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. తాను ఎక్కడో ఒక చోటపోటీ చేస్తే దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడం కుదరదని, అందువల్లనే పోటీకి దూరంగా ఉన్నానని తెలిపారు.
Next Story

