Thu Jan 29 2026 15:26:53 GMT+0000 (Coordinated Universal Time)
విచారణకు హాజరుకాలేను.. సోనియా అభ్యర్థన
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావడం లేదు.

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావడం లేదు. ఈ మేరకు ఏఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. సోనియాకు వారం రోజుల క్రితం కరోనా సోకింది. ఆమె హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా ఈడీ ఎదుటకు హాజరు కావడం కష్టమని, విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఈడీని ఏఐసీసీ కోరింది.
కరోనా సోకినందున...
నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో హాజరు కావాలని సోనియా గాంధీ నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. కరోనా నుంచి ఇంకా కోలుకోలేనందున తాను విచారణకు హాజరుకాలేనని సోనియా ఈడీని అభ్యర్థించినట్లు తెలిపింది. కరోనా నుంచి కోలుకున్నట్లు ఇంకా వైద్యులు నిర్ధారించకపోవడంతో ఈ అభ్యర్థనను సోనియా చేశారు. జూన్ 2వ తేదీన సోనియా గాంధీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
Next Story

