Fri Dec 05 2025 12:23:50 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండికూటమి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండికూటమి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. కొద్ది సేపటి క్రితం ఇండి కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన....
ఎన్డీ కూటమిలోని అన్ని పక్షాలు సమావేశమై సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు మల్లికార్జున ఖర్గే తెులిపారు. సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత గోవా లోకాయుక్త ఛైర్మన్ గా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండి కూటమి తరుపున ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు.
Next Story

