Sat Jan 31 2026 20:29:36 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఈడీ ఎదుటకు రాహుల్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట నేడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్లువచ్చాయి

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట నేడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈరోజు రాహుల్ ఈడీ ఎదుట హాజరుకానుండటంతో కాంగ్రెస్ పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించింది.
నిరసనలతో....
ఈడీ ఆఫీసులో రాహుల్ గాంధీ ఉన్నంత సేపు నిరసన తెలియజేయాలని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించాయి. తెలంగాణలో సయితం ఈ ఆందోళన కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు చేపట్టాయి. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సోనియా గాంధీ కూడా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా అస్వస్థతకు గురి కావడంతో ఆమె అభ్యర్థన మేరకు ఈ నెల 20వ తేదీన రావాలని సోనియాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో నోటీసులు జారీ చేశారు.
Next Story

