Wed Jan 28 2026 16:30:29 GMT+0000 (Coordinated Universal Time)
Exit Polls : గోవా హోరా హోరీ
గోవా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ పోరాడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లోనూ అదే బయటపడింది.

గోవా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ పోరాడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లోనూ అదే బయటపడింది. నలభై స్థానాలున్న గోవాలో కాంగ్రెస్, బీజేపీలు 13 నుంచి 17 స్థానాలు కైవసం చేసుకునే వీలుందని తేల్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు నుంచి నాలుగు, టీఎంసీకి రెండు నుంచి నాలుగు, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారని రిపబ్లిక్ టీవీ తేల్చింది.
జీ న్యూస్ ప్రకారం....
జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 14 నుంచి 18 స్థానాలు, కాంగ్రెస్ 13 నుంచి 17 స్థానాలు గెలవవచ్చన్న అంచనాలో ఉన్నాయి. గోవాలో మాత్రం దాదాపు అన్ని సంస్థలు చేపట్టిన సర్వేలు బీజేపీ,కాంగ్రెస్ లో పోటా పోటీగా తలపడినట్లు వార్తలు అందుతున్నాయి.
- Tags
- exit polls
- goa
Next Story

