Wed May 15 2024 23:38:25 GMT+0000 (Coordinated Universal Time)
Poonam Pandey : పూనమ్ పాండే పై పోలీసులకు ఫిర్యాదు
మోడల్ పూనమ్ పాండేపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక జర్నలిస్టు ముంబయి పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు
బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండేపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక జర్నలిస్టు ముంబయి పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి చర్యలను తీసుకోవాల్సిందిగా మహారాష్ట్ర డీజీపీని కోరారు. పూనమ్ పాండే చనిపోయినట్లు ఫేక్ న్యూస్ తో అభిమానులనే కాకుండా దేశంలో ప్రజలందరినీ ఫూల్స్ చేయాలని ప్రయత్నించారు. ఆమె మేనేజర్ నుంచి వచ్చిన ట్వీట్ కావడంతో అందరూ పూనమ్ పాండే చనిపోయిందనే నమ్మేశారు.
తాను బతికే ఉన్నట్లు...
కానీ మరుసటి రోజు తాను బతికే ఉన్నట్లు పూనమ్ పాండే వీడియో రిలీజ్ చేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఇదేం విచిత్రమంటూ నెటిజన్లు ఫైరయ్యారు. అయితే తాను సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహనను ప్రజల్లో పెంపొందించడం కోసమే మరణించినట్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో పూనమ్ పాండేపై చర్యలు తీసుకోవాలంటూ ముంబయి పోలీసులకు జర్నలిస్టు ఫిర్యాదు చేశారు.
Next Story