Sun Mar 15 2026 15:02:17 GMT+0530 (India Standard Time)
బ్యాడ్ న్యూస్ .. భారీగా పెరిగిన అమూల్ పాల ధరలు
అమూల్ పాల ధరలను కంపెనీ భారీగా పెంచేసింది.ఈరోజు ఉదయం నుంచే పెరిగిన ధరలు వర్తిస్తాయని తెలిపింది

అమూల్ పాల ధరలను కంపెనీ భారీగా పెంచేసింది. వినియోగదారుల జేబులకు చిల్లు పడేలా అమూల్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అమూల్ సంస్థ చెబుతుంది. గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో వినియోగదారులకు జూన్ మొదటి వారంలోనే షాక్ తగిలినట్లయింది.
నేటి ఉదయం నుంచే...
ఈరోజు ఉదయం నుంచే పెరిగిన ధరలు వర్తిస్తాయని గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది. అమూల్ కు చెందిన లీటరు పాల ధరపై రెండు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అమూల్ తాజ్, అమూల్ శక్తి, అమూల్ గోల్డ్ పాల ధరలపై లీటకు రెండు రూపాయలు పెంచింది. ఈ మూడు వెరైటీలకు మాత్రమే ధర పెరిగింది. దేశ వ్యాప్తంగా పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఇది వినియోగదారులకు అదనపు భారంగా మారనుంది.
Next Story

