Fri Dec 05 2025 16:56:43 GMT+0000 (Coordinated Universal Time)
Cold Riff Cough Syrup : కోల్డ్ రిఫ్..సిరప్ కాదు.. విషం...తాగితే ఇక అంతే.. చిన్నారుల ఆయువు తీస్తుంది

కోల్డ్ రిఫ్..సిరప్ చిన్నారుల ప్రాణం తీస్తుంది. అధికారుల సోదాల్లో దగ్గుమందు తయారీ అపరిశుభ్రవాతావరణంలో జరుగుతుందని గుర్తించింది. దగ్గుమందు తయారీలో తగిన జాగ్రత్తలు పాటించడం లేదని ఈ సోదాల ద్వారా వెల్లడయింది. మధ్యప్రదేశ్ లో జరిగిన వరస దాడుల్లో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తయారీదారులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ విషపూరిత సిరప్ ను పిల్లలకు ఇవ్వాలని సూచించిన డాక్టర్ ను కూడా అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో గత నెలరోజుల వ్యవధిలో పదిమంది చిన్నారులు కోల్డ్ రిఫ్ సిరప్ వల్ల మృతి చెందారు. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఇద్దరు చిన్నారులు దగ్గు మందు కారణంగానే మృతిచెందారు.
పదుల సంఖ్యలో...
పదుల సంఖ్యలో చిన్నారులు దగ్గు మందు సిరప్ వల్ల కిడ్నీలు పాడైపోయి వెంటిలేటర్లపై చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నట్లు గుర్తించారు. చలి కాలం కావడంతో పాటు వర్షాలు విపరీతంగా పడుతుండటంతో ఎక్కువ మంది చిన్నారులు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో చిన్నారులను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళుతున్నారు. కొందరు వైద్యులు దగ్గు త్వరగా తగ్గేందుకు మందును ప్రిస్కైబ్ చేస్తున్నారు. దగ్గుమందు తీసుకుని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులకు మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ సహా మహారాష్ట్ర నాగపూర్ పూణే నగరాల్లోని హాస్పిటల్స్ లో చిన్నారులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
తెలంగాణలోనూ నిషిద్ధం...
తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మా సంస్థ ఈ ప్రాణాంతక విష రసాయనం కోల్డ్ రిఫ్ సిరప్ ను ఉత్పత్తి చేసి డాక్టర్ల ద్వారా మార్కెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.మధ్యప్రదేశ్ పోలీసులు ఫార్మా సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడుకు వెళ్లి సంస్థ యజమానిని అరెస్ట్ చేశారు. చింద్వారా లో ఈ సిరప్ ను పిల్లలకు సూచించడం ద్వారా వారి మృతికి కారణమైన డాక్టర్ ప్రవీణ్ సోనీని ఇప్పటికే అరెస్ట్ చేశారు.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.. సిరప్ తయారీ సంస్థకు చెందిన అన్ని ఔషధ ఉత్పత్తులపై రాష్ట్రంలో నిషేధం విధించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా దగ్గు మందు విషయంలో వైద్యులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. దగ్గుమందును వైద్యులు చిన్నారులకు ప్రిస్కైబ్ చేయవద్దని సూచించింది.
Next Story

