Thu Sep 28 2023 14:01:37 GMT+0000 (Coordinated Universal Time)
అల్లర్ల ఎఫెక్ట్ : సిలిండర్ ధర రూ.1800
మైతీ తెగను షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితాలో చేర్చుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ వివాదానికి కారణమైంది. సుప్రీంకోర్టు..

రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన వివాదం.. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో హిసాత్మక ఆందోళనలకు దారితీసింది. మైతీ తెగను షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితాలో చేర్చుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ వివాదానికి కారణమైంది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. మూడు వారాలుగా మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టాన్స్ పోర్ట్ సేవలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి ట్రక్కులను నడిపేందుకు కూడా యజమానులు, డ్రైవర్లు ముందుకు రావడం లేదు.
రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. ఫలితంగా నిల్వ ఉన్న సరుకుల ధరలను వ్యాపారస్తులు విపరీతంగా పెంచేశారు. బియ్యం, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, కోడిగుడ్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. 50 కిలోల బియ్యం ధర రూ.1800 లకు చేరింది. గతంలో ఈ ధర రూ.900లుగా ఉండేది. అలాగే వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో.. ఒక్క సిలిండర్ ధర రూ.1800పైగానే ఉంది. ఇంఫాల్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.170కి, ఒక కోడిగుడ్డు ధర రూ.10కి, కిలో బంగాళదుంపల ధర రూ.100కి పెరిగిందని ప్రజలు తెలుపుతున్నారు.
Next Story