Thu Dec 25 2025 04:44:34 GMT+0000 (Coordinated Universal Time)
కరుణామయుడు ఏసు ప్రభువు జన్మదినం.. ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు
నేడు దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

నేడు దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు కరుణామయుడు ఏసు ప్రభువు జన్మదిన వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దేశంలోని అన్ని ప్రధాన చర్చిలను ముస్తాబు చేశారు. రంగు రంగుల దీపాలతో అలంకరించారు. నిన్న రాత్రి నుంచే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా కూడా క్రైస్తవ సోదరులు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఏసు జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా...
ఏసుక్రీస్తు జన్మదినమైన డిసెంబరు 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. విశ్వమానవాళికి మార్గదర్శనం చేసిన క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు క్రైస్తవ సోదరులు నేడు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. ఒక్క మతమే కాకుండా అన్ని మతాల వారూ ఆచరించాల్సిన క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గదర్శనంగా నిలుస్తాయి. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు పరస్పరం మత విశ్వాసాలను కాపాడుకుంటూ కొనసాగాలని కోరుకుంటారు. అన్ని దేశాల్లోనూ క్రిస్మస్ వేడుకలను నిన్నటి రాత్రి నుంచి ప్రారంభం కావడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు.
శాంతి సందేశం ఇచ్చిన..
పేద నుంచి ధనికుల వరకూ చర్చికి వెళ్లి ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిన ఏసుక్రీస్తు పుట్టిన రోజున క్రిస్మస్ వేడుకలనుజరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ప్రతి ఏటా డిసెంబరు 25వ తేదీన ఈ వేడుకలను నిర్వహించుకుంటారు. జీసెస్ కటాక్షాలు పొందేందుకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తారు. పేదలకు అన్నదానాలు చేస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అన్ని చర్చిలు సుందరంగా అలంకరించారు. హైదరాబాద్ లోనూ అన్ని చర్చిలు ముస్తాబయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు అందచేశారు.
Next Story

