Sun Mar 15 2026 15:46:10 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బిపిన్ రావత్ మృతి
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు ఆర్మీ అధికారిక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో రావత్ కు 90 శాతం కాలిన గాయాలయ్యాయి. చివరి క్షణం వరకూ దేశ రక్షణ, సేవ కోసం పనిచేసి జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య మధులిక కూడా మృతి చెందారు.
ప్రమాదంలో....
ఈరోజు మధ్యాహ్నం తమిళనాడులో లోని కూనూరు దగ్గర జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ మృతి చెందారు. హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న 14 మంది మరణించారు. బిపిన్ రావత్ తో పాటు 8 మంది సీనియర్ అధికారులు కూడా మరణించడం దురదృష్టకరం. బిపిన్ రావత్ మృతికి దేశమంతా శ్రద్ధాంజలి ఘటిస్తుంది.
- Tags
- bipin rawath
- died
Next Story

