Mon Feb 02 2026 00:04:58 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్‌కు మణిపూర్ విద్యార్థులు
మణిపూర్ విద్యార్ధుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నం ఫలించింది. రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు

మణిపూర్ విద్యార్ధుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నం ఫలించింది. రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. సొంత ఖర్చులతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక విమానం హైదరాబాద్‌కు, మరోక విమానం కోల్‌కత్తాకు, అక్కడినుంచి స్వస్ధలాలకు పంపేలా చర్యలు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఉదయం పదకొండు గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం చేరుకోనుంది.
రెండు ప్రభుత్వాలు...
ప్రభుత్వం ఈరోజు ఉదయం 9.35 గంటలకు హైదరాబాద్‌కు విమానం బయలుదేరనుంది. అందులో 108 మంది ఏపీ విద్యార్ధులు ఉన్నారని చెబుతున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా మణిపూర్‌లో చిక్కుకున్న విద్యార్థులకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. వారిని స్వస్థలాలలకు చేర్చేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి.
Next Story

