Sun Dec 14 2025 01:54:58 GMT+0000 (Coordinated Universal Time)
Kejriwal : కేజ్రీవాల్ కు బెయిల్.. అయితే షరతులు వర్తిస్తాయి
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు.

Kejriwal :ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమన్లకు సంబంధించి ఆయనకు బెయిల్ మంజూరయింది. పదిహేను వేల రూపాయల పూచీకత్తును సమర్పించాలని కర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ కు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
పలుమార్లు సమన్లు ఇచ్చినా...
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరసగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ చేపట్టేందుకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. దీంతో ఈడీ అధికారులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. కోర్టుకు హాజరు కావాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించడంతో కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఆయనకు బెయిల్ లభించింది.
Next Story

