Sat Dec 07 2024 23:22:15 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ సేతుపతికి కోర్టు నోటీసులు జారీ
తమిళ స్టార్ హీ విజయ్ సేతుపతి, అతని మేనేజర్ జాన్సన్ లకు చెన్నై సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టు నోటీసులు జారీ చేసింది
తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అతని మేనేజర్ జాన్సన్ లకు చెన్నై సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టు నోటీసులు జారీ చేసింది. హీరో, విలన్ గా రాణించిన విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా.. ఇటీవలే ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి - మహాగాంధీ అనే వ్యక్తికి మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. గత నెల జాతీయ అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లిన విజయ్ నవంబర్ 2వ తేదీన తిరిగి చెన్నైకి వచ్చారు. చెన్నై ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతిని చూసిన మహాగాంధీ అనే వ్యక్తి ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లడంతో.. అసలు గొడవ మొదలైంది.
ఎయిర్ పోర్టులో...
మహాగాంధీ కూడా వృత్తిరీత్యా నటుడే కావడంతో.. విజయ్ దగ్గరకు వెళ్లాడు. విజయ్ దగ్గరకు వచ్చిన అతడిని మేనేజర్ జాన్సన్ అడ్డుకున్నాడు. అనంతరం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత విమానాశ్రయం వెలుపల విజయ్ మేనేజర్ జాన్సన్ తనపై దాడి చేసినట్టు మహాగాంధీ మీడియాకి తెలిపాడు. అయితే.. తాను దాడిచేసిన విజువల్స్ మాత్రమే చూపించి, వాళ్లు దాడిచేసిన విజువల్స్ దాచేశారంటూ మహాగాంధీ వాపోయాడు. ఈ ఘటనపైనే మహాగాంధీ చెన్నై కోర్టులో ఫిర్యాదు చేయగా.. చెన్నై సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టు విజయ్ సేతుపతి, జాన్సన్ లకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లపై విజయ్ సేతుపతి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Next Story