Mon Mar 23 2026 04:01:57 GMT+0530 (India Standard Time)
వాణీ జయరామ్ మృతి మిస్టరీపై పోలీసులు ఏమన్నారంటే?
ప్రముఖ గాయనివాణీ జయరామ్ మృతి మిస్టరీని చెన్నై పోలీసులు తేల్చేశారు. ఆమె ప్రమాదవశాత్తూ మరణించిందని నిర్ణారించారు

ప్రముఖ గాయనివాణీ జయరామ్ మృతి మిస్టరీని చెన్నై పోలీసులు తేల్చేశారు. ఆమె ప్రమాదవశాత్తూ మరణించిందని నిర్ణారించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ నివేదికలు కూడా వచ్చాయని వాణీ జయరామ్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని చెన్నై పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం చెన్నైలోని తన స్వగృహంలో వాణీ జయరామ్ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణించినట్లు తొలుత ఇంట్లో పనిమనిషి తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు.
సీసీ టీవీ పుటేజీ....
వాణీ జయరామ్ పై తొలుత అనేక అనుమానాలు తలెత్తాయి. దీంతో పోలీసులు విచారణ చేశారు. టీపాయ్ తగిలి ఆమె కింద పడి పడిపోయి తలకు బలమైన గాయం అవ్వడం వల్లనే వాణీ జయరామ్ మృతి చెందారని పోలీసులు నిర్ధారించారు. అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీలన్నింటినీ పరిశీలించామని, అయితే ఎలాంటి అనుమానాస్పద కదలికలు తమకు కనిపించలేదని చెన్నై పోలీసులు తెలిపారు.
Next Story

