Mon Feb 02 2026 06:14:14 GMT+0000 (Coordinated Universal Time)
రైలుపై చిరుత కళేబరం
ఆగిఉన్న రైలుపై చిరుత కళేబరం అధికారులను ఆందోళనకు గురి చేసింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఆగిఉన్న రైలుపై చిరుత కళేబరం అధికారులను ఆందోళనకు గురి చేసింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వనీ బొగ్గు గని ప్రాంతంలో గుగ్గూస్ రైల్వే సైడింగ్ వద్ద ఆగిఉన్న రైలుపై చిరుత కళేబరం ఉంది. చిరుత కళేబరాన్ని చూసిన వెంటనే అధికారులు అటవీశాఖకు సమచారం అందించారు.
విద్యుత్ లైన్లు తగిలి...
రైలు ఇంజిన్ పై చిరుత ఎందుకు ఎక్కిందన్న దానిపై అనేక సందేహలు కలుగుతున్నాయి. రైలు ఇంజిన్ పైకి రాగానే హైటెన్షన్ విద్యుత్తు తీగలను తగులుకుని మరణించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరుత ప్రాణాలు పోయి ఉంటాయని చెబుతున్నారు. చిరుత కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం చంద్రపూర్ కు తరలించారు.
Next Story

