కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల పూర్తి, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు నడపాలని వినతి పత్రం ఇచ్చారు. ఇటీవల బడ్జెట్టులో ప్రకటించిన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్ల గురించి భేటీలో ప్రస్తావించారు. ఏపీని టచ్ చేస్తూ వెళ్లే మూడు హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడారును తిరుపతిని కనెక్ట్ చేసేలా చూడాలని కేంద్ర మంత్రిని చందబాబు కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. తాడిపత్రి నుంచి ముంబై జేఎన్ పీటీ పోర్టుకు అరటి ఎగుమతులకు వీలుగా 50 శాతం రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లు ముఖ్యమంత్రి కేటాయించాలన్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కేంద్ర మంత్రికి తెలిపారు.

