Sun Mar 08 2026 15:23:15 GMT+0530 (India Standard Time)
బెంగళూరుకు చంద్రబాబు, జూ.ఎన్టీఆర్
ఆయన పల్స్ దారుణంగా పడిపోయాయని, తిరిగి రప్పించేందుకు చాలా శ్రమించారు. కుప్పంలోని ..

నారా లోకేశ్ "యువగళం" పేరుతో చేపట్టిన పాదయాత్ర నిన్న ప్రారంభమైంది. ఈ సందర్భంగా యాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్నకు తీవ్ర గుండెపోటు రావడంతో.. తూలి పడిపోయారు. వెంటనే ఆయన్ను కార్యకర్తలు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. తారకరత్నను పరిశీలించిన వైద్యులు.. ఆయన పల్స్ దారుణంగా పడిపోయాయని, తిరిగి రప్పించేందుకు చాలా శ్రమించారు. కుప్పంలోని పేస్ వైద్య కళాశాలలో ఆయనకు చికిత్సను ప్రారంభించి, యాంజియోగ్రామ్ నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం నిన్న అర్ధరాత్రి ఆయనను బెంగళూరుకు తరలించారు.
బెంగళూరు నుంచి వచ్చిన రెండు ప్రత్యేక అంబులెన్సుల ద్వారా ఆధునిక వైద్య పరికరాల సపోర్టుతో బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. వెనుకే బాలకృష్ణ కూడా బెంగళూరుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బెంగళూరుకు వెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్న కోసం బెంగళూరు వెళ్లనున్నట్లు సమాచారం. తారకరత్న భార్య, కుమార్తెలు ప్రస్తుతం బెంగళూరు ఆసుపత్రిలోనే ఉన్నారు.
Next Story

