Sat Mar 07 2026 14:55:49 GMT+0530 (India Standard Time)
ISRO : ఇస్రో కొత్త ఛైర్మన్ ఎవరో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఛైర్మన్ గా వి. నారాయణన్ నియమితులయ్యారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఛైర్మన్ గా వి. నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ నుంచి ఈ నెల 14వ తేదీన పదవీ బాధ్యతలను తీసుకోనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నారాయణన్ రెండేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్ పదవిలో కొనసాగుతారు. నారాయణన్ ప్రస్తుతం ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ కు చీఫ్ గా కొనసాగుతున్నారు.
అపార అనుభవం ఉన్న...
స్సేస్ టెక్నాలజీలో అపార అనుభవం ఉన్న నారాయణన్ ను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నారాయణన్ జీఎస్ఎల్వీ మార్క్ -2, 3, వాహక నౌకల రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన నారాయణన్ 2001లో స్సేస్ ఇంజినీరింగ్ లో పి.హెచ్.డి. చేశారు. ఆయన నియామకంతో ఇస్రో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుందాం.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

