Sun Mar 15 2026 15:48:22 GMT+0530 (India Standard Time)
ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాలు
నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిన్నరలో దేశంలో పది లక్షల ఉద్యోగాలు భర్లీ చేయాలని మోదీ ఆదేశించారు.

ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిన్నరలో దేశంలో పదిల లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. కేంద్ర కేబినెట్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని శాఖల్లోని ఖాళీలపై ప్రధాని మోదీ సమీక్షించారు. ఈ సందర్భంగా మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఇచ్చిన హామీని....
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మోదీ ఇంత వరకూ అమలు పర్చలేదు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు. దీనిపై విమర్శలు వినపడుతున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రివర్గం ఉపసంఘం భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Next Story

