Mon Mar 16 2026 06:53:17 GMT+0530 (India Standard Time)
BJP : అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు
కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయేంద్ర యడ్యూరప్ప ను కేంద్ర నాయకత్వం నియమించింది

కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయేంద్ర యడ్యూరప్పను కేంద్ర నాయకత్వం నియమించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర. ఆయనను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందుగానే కర్ణాటక రాష్ట్రంలో మళ్లీ సత్తా చాటాలని భావించిన అధినాయకత్వం ఆయన నియామకాన్ని చేపట్టింది.
అసెంబ్లీ ఎన్నికల్లో...
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. లింగాయత్ లు దూరం కావడం వల్లనే అధికారాన్ని కోల్పోయామని బీజేపీ భావిస్తుంది. మఠాధిపతులు కూడా తమకు సహకరించలేదని, అందుకే బీజేపీ ఓడిపోయిందని భావించిన అధినాయకత్వం లోక్సభ ఎన్నికల వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. యడ్యూరప్ప కుటుంబానికే తిరిగి పార్టీ అధ్యక్ష పదవిని బీజేపీ కట్టబెట్టింది.
Next Story

