Wed Mar 18 2026 23:41:17 GMT+0530 (India Standard Time)
బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
బ్యాంకు ఉద్యోగులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై వారానికి ఐదు రోజులు పనిదినాలుగా నిర్ణయించనునంది

ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై వారానికి ఐదు రోజులు పనిదినాలుగా నిర్ణయించనునంది. ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే ఈ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేస్తుందని చెబుతున్నారు.
త్వరలో నోటిఫికేషన్...
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదలవుతుందని అంటున్నారు. డిజిటలైజేషన్ పెరిగిన నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించేందుకు, మెరుగైన, నైపుణ్యమైన పని కల్పించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తుంది. ఇప్పటి వరకూ రెండు, నాలుగు శనివారాలు సెలవు దినాలుగా ఉన్నాయి. ఇకపై వారంలో ప్రతి శని, ఆదివారాలు సెలవుదినాలుగా ప్రకటించే అవకాశముంది.
Next Story

