Fri Dec 05 2025 12:47:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేంద్రం అఖిలపక్ష సమావేశం
పహల్గాం ఘటనపై నేడు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది

పహల్గాం ఘటనపై నేడు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటన, మృతి చెందిన పర్యాటకులు, తర్వాత పరిణామాలతో పాటు నిన్న జాతీయ భద్రతామండలి తీసుకున్న నిర్ణయాలను ఈ అఖిలపక్ష సమావేశంలో వివరించే ప్రయత్నం చేయనుంది. తాము పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల ఉగ్రవాదాన్ని అణిచి వేసేందుకు ఏమేం చర్యలు తీసుకున్నామో వివరించనున్నారు.
పహల్గాం ఘటనపై...
ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశముంది. అలాగే అన్ని పక్షాలకు చెందిన నేతలకు ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. పహల్గామ్ ఘటన లో ప్రతిపక్షాల నుంచి కూడా సూచనలు, సలహాలను కూడా స్వీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.
Next Story

