Fri Dec 05 2025 09:35:48 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నేడు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది. భారీ సంఖ్యలో ఉద్యోగాల నియామక పత్రాలను అందచేయనుంది. ఈరోజు దేశ వ్యాప్తంగా పీఎం రోజ్గార్ మేళాను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన పరీక్షల్లో ఎంపికయిన వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందచేయనున్నారు.
ఒకే రోజు యాభై వేల మందికి...
ఈరోజు దేశంలో మొత్తం యాభై ఒక్క వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన వారికి ఈనియామకపత్రాలను అందచేయనున్నార. పీఎం రోజ్ గార్ మేళాలో వర్చువల్గా నియామక పత్రాలు ప్రధాని మోదీ అందజేనున్నారు. ఈ సందర్భంగా తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాలు చేపడుతుందని ప్రధాని మోదీ దేశ ప్రజలకు వివరించనున్నారు.
Next Story

