Tue Mar 17 2026 17:40:12 GMT+0530 (India Standard Time)
పంజాబ్ పోలీసులపై కేంద్రం సీరియస్
ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.

ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పంజాబ్ పోలీసులను ఢిల్లీకి పిలిపించి విచారణ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎస్పీజీ యాక్ట్ కింద పంజాబ్ పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఒక ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకుని వెనక్కు రావడం దేశ చరిత్రలో ఇదే ప్రధమమని చెబుతున్నారు.
ఎస్పీజీ యాక్ట్ కింద...
ప్రధాని పర్యటన వివరాలు ముందుగా పంజాబ్ ప్రభుత్వానికి తెలుసునని, ప్రధాని రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్నారని రైతులకు లీకు చేసిందెవ్వరన్న దానిపై విచారణ జరగనుంది. పంజాబ్ డీజీపీ దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

