Sat Mar 21 2026 09:03:13 GMT+0530 (India Standard Time)
కేంద్రం నిర్ణయం.. స్త్రీల వివాహ వయస్సు 21 ఏళ్లు
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల వివాహ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల వివాహ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల వివాహ వయసు ఇప్పటి వరకూ 18 సంవత్సరాలు ఉంది. అయితే దీనిని 21 సంవత్సరాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చట్టాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రి వర్గం దీనికి ఆమోదం తెలిపింది.
మోదీ ప్రకటనకు అనుగుణంగానే...
గత ఆగస్టు 15న ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అమ్మాయిల వివాహ వయసును పెంచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో మహిళలు ముందంజ వేయాలంటే వివాహ వయసును పెంచాల్సి ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story

