Thu Mar 19 2026 01:27:49 GMT+0530 (India Standard Time)
ఒవైసీ ప్రాణాలకు రక్షణగా కేంద్రం కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ ఒవైసీకి జడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి జడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. నిన్న అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనతో కేంద్ర హోంశాఖ సమీక్ష చేసింది. ఈ సమీక్షలో అసదుద్దీన్ ఒవైసీకి సీఆర్పీఎఫ్ తో జడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేయాాలని నిర్ణయించింది.
జడ్ కేటగిరీ.....
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సందర్బంగా ప్రచారంలో పాల్గొని ఢిల్లీకి వస్తున్న అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే ఒవైసీపై కాల్పులు జరిపామని వారు విచారణలో తెలిపారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీకి జడ్ కేటగిరి భద్రతను కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.
Next Story

