Sat Dec 13 2025 19:31:09 GMT+0000 (Coordinated Universal Time)
Toll Plaza : టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు.. రయ్.. రయ్ మంటూ
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజా వచ్చే ఏడాది కొత్త విధానం తీసుకురానుంది. టోల్ ప్లాజాను వాహనం దాటిన వెంటనే యూజర్ బ్యాంకు అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా కట్ అవుతుందని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు.
వచ్చే ఏడాది కొత్త టోల్ విధానం...
దేశ వ్యాప్తంగా కొత్త ఏడాది కొత్త టోల్ విధానం అమలులోకి రానుందని నితిన్ గడ్కరీ తెలిపారు. దీని ప్రకారం ఇక టోల్ ప్లాజాల వద్ద ఎవరూ వాహనాలను ఆపరని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది అమలు చేయనున్నట్లు ఆయన లోక్ సభలో తెలిపారు. దేశ వ్యాప్తంగా పది లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆప్ ఇండియా కొత్తగా ఎన్ఈటీసీ కార్యక్రమాన్ని తీసుకు వచ్చిందని, ఇది కూడా ఫాస్టాగ్ ద్వారానే పనిచేస్తుందని నితిన్ గడ్కరీ చెప్పారు.
Next Story

