Thu Mar 19 2026 08:37:11 GMT+0530 (India Standard Time)
Breaking : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. అసన్ సోల్ నుంచి వరంగల్ వరకూ సరికొత్త రైల్వే కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భద్రాచలం వరకూ కొత్త రైల్వే లైన్ కారిడార్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో పాటు అన్ని పనులు పూర్తయితే తెలంగాణ ప్రజలకు మంచి ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు...
విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమి కాకుండా వేరొక చోట భూమిని కేటాయించనున్నట్లు చంద్రబాబు తెలిపారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు సమస్యే కాదన్న ఆయన త్వరలోనే దాని ఏర్పాటు పూర్తి అవుతుందని చెప్పారు.
Next Story

