Fri Mar 20 2026 11:42:07 GMT+0530 (India Standard Time)
జమిలి ఎన్నికలపై జేపీసీ నియామకం
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించింది

జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించింది. మొత్తం 31 మంది ఎంపీలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు స్థానం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు, అధ్యయనం చేయాలని సూచించింది.
మూడు నెలల్లో...
ఇందుకు మూడు నెలల కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం విధించింది. జమిలి ఎన్నికలపై నిన్న కేంద్ర ప్రభుత్వం బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన అనంతరం జేపీసీకి అప్పగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఓటింగ్ జరగ్గా మెజారిటీ సభ్యులు జేపీసీకి అప్పగించాలని కోరడంతో ఇరవై నాలుగు గంటలు గడవకముందే కేంద్ర ప్రభుత్వం జేపీసీని నియమించింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

