Wed Apr 01 2026 20:13:49 GMT+0530 (India Standard Time)
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. 2022 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని, 2024లో ఇంధనం ధరలు రెండు రూపాయలు తగ్గించామని చెప్పింది. ప్రజలపై భారం పడకుండా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎల్పీజీ ధరలపై కూడా...
ఎల్పీజీ ధరలు కూడా పెంచే ఉద్దేశం లేదని తెలిపింది. దేశంలో రెండు నెలలకు పైగా పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్రం తొందరపడి గ్యాస్ కోసం, పెట్రోలు కోసం క్యూలు కట్టాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ప్రజలపై భారం మోపబోమని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
Next Story

