Wed Jan 28 2026 22:13:38 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎన్నికల నోటిఫికేషన్
నేడు రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

నేడు రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లో మూడు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి ఈ నెల 15 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం పది గంటల నుంచి నామినేషన్లను అసెంబ్లీ శాసనసభ కార్యదర్శి కార్యాలయంలో స్వీకరిస్తారు.
ఫిబ్రవరి ఏడున పోలింగ్... కౌంటింగ్...
ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నెల 15వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణకు ఆఖరిగడువుగా నిర్ణయించారు. 16వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. పోలింగ్ రోజునే రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ ఉంటుది. దేశ వ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది.
Next Story

