Fri Dec 05 2025 15:01:22 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : రాజ్యసభ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?
దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది

దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. పదిహేను రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 8వ తేదీన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి పదిహేనో తేదీగా నిర్ణయించింది. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16వ తేదీగా నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆరింటికి....
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. తెలంగాణలోనూ మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. దీంతో రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి చివరి వారంలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలింగ్ జరిగే రోజు కౌంటింగ్ జరగనుంది. ఉదయం పది గంటల నుంచి రాజ్యసభకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారు.
Next Story

