Sat Dec 27 2025 05:07:01 GMT+0000 (Coordinated Universal Time)
India : దేశంలో జనగణనకు అంతా సిద్ధం
భారతదేశంలో పదహారేళ్ల తర్వాత తొలిసారిగా జనగణన ప్రక్రియ జరగనుంది.

భారతదేశంలో పదహారేళ్ల తర్వాత తొలిసారిగా జనగణన ప్రక్రియ జరగనుంది. ఇందుకు రంగం సిద్ధమైంది. ఈ జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది, మొదటి విడత లో గృహాల జాబితా, గృహ గణన చేయనున్నారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు, రెండో విడత జనాభా గణన ఫిబ్రవరి 2027లో జరుగుతుంది, ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో స్మార్ట్ఫోన్ల ద్వారా జరగనుంది, ఇందులో కుల గణన కూడా మొదటిసారి చేర్చారు. 2027 నాటికి దేశ వ్యాప్తంగా జనగణన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే జనగణన చేయడం ముఖ్యం. పార్లమెంటు నియోజవర్గాల సంఖ్య కూడా వచ్చే ఎన్నికల నాటికి పెరిగే అవకాశముంది.
ఇంటి వివరాలు కూడా...
అందుకే ఈసారి జనగణనకు ప్రత్యేకత సంతరించుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉండటంతో అక్కడ పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశముంది. అలాగే దక్షిణాదిన ఉన్న ప్రస్తుతమున్న పార్లమెంటు స్థానాలు తగ్గే అవకాశం లేదని ఇప్పటికే రాజకీయ ప్రకటనలు వెలువడ్డాయి. జనగణన ఇలా సాగుతుంది.మొదటి విడత లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకూ జరుగుతంది. ఇంటి నిర్మాణ సామగ్రి, సౌకర్యాలు (నీరు, వెలుగు, వంట, స్నానం, మరుగుదొడ్డి), ఫోన్, ఇంటర్నెట్ వంటి వస్తువుల యాజమాన్యం, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించనున్నారు. దీనివల్ల ఈ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను భవిష్యత్ లో అందించే వీలుంది.
కులగణన కూడా...
రెండవ విడత గా ఫిబ్రవరి 2027న జనగణన ప్రారంభం కానుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ వంటిమంచుతో కప్పబడిన ప్రాంతాల్లో సెప్టెంబర్ 2026లో జరుగుతుంది. డిజిటల్ పద్ధతిలో జనగణన చేయనున్నారు. ఎన్యూమరేటర్లు స్మార్ట్ఫోన్ యాప్ల ద్వారా డేటాను సేకరిస్తారు. దీంతో పాటు దేశంలో మొదటిసారి కుల గణన చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కుల గణనను ఈ జనగణనలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు.ఈ గణన 2011 తర్వాత జరుగుతుంది, కోవిడ్-19 కారణంగా వాయిదా పడింది. జూన్ 2025లో కేంద్ర ప్రభుత్వం జనగణన నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 2025 నాటికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండు దశల షెడ్యూల్ను లోక్ సభకు తెలియజేసింది. ఈ ప్రక్రియ కోసం క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించడం, శిక్షణ ఇవ్వడం వంటి సన్నాహాలు జరుగుతున్నాయి.
Next Story

