Mon Mar 30 2026 15:04:09 GMT+0530 (India Standard Time)
ఇంటింటి సర్వే ఏప్రిల్ 1వ తేదీ నుంచి
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన -2027 ప్రక్రియ ప్రారంభం కానుంది

దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన -2027 ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. జనగణన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సహజీవన జంటలకు కుటుంబ హోదా ఇవ్వనుంది. చాలా కాలంగా కలిసి ఉంటున్న వారిని ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించారు.
ఏపీ, తెలంగాణలోనూ...
మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి గృహ వివరాల సేకరణ చేపట్టనున్నారు. తొలిసారిగా స్వయంగా వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు. దాదాపు 33 ప్రశ్నలతో ప్రశ్నావళిని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. 16 భాషల్లో జనాభా లెక్కలను సేకరించనుంది. 21 నెలల్లో రెండు విడతల్లో జనగణన చేయనుంది. ఏపీలో మే1 నుంచి ప్రతి ఇంట సర్వే జరుగుతంది. తెలంగాణలో మే 11వ తేదీ నుంచి ఇంటింటి సర్వే జరగనుంది.
Next Story

