Fri Dec 05 2025 17:50:39 GMT+0000 (Coordinated Universal Time)
Delhi liqour scam : డిప్యూటీ సీఎంకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సారి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు సీబీఐ నోటీసులు జారీ చేసింది

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సారి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రేపు విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.
రేపు విచారణకు...
అయితే తన పట్ల కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుని కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని మనీష్ సిసోడియా ఆరోపించారు. తాను ఇటువంటి వాటికి బెదిరేది లేదన్నారు. ఒకసారి తన ఇంట్లో సోదాలు చేశారని, ఏమీ లభించలేదని పేర్కొన్నారు. తాను సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు.
Next Story

