Fri Apr 10 2026 11:30:05 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి టోల్ ప్లాజ్ దాటాలంటే?
నేటి నుంచి టోల్ ప్లాజా దాటాలంటే నగదు చెల్లింపులు అనుమతించరు

నేటి నుంచి టోల్ ప్లాజాకు వెళ్లే వారికి హై అలెర్ట్. ఇకపై ఈరోజు నుంచి నగదు చెల్లింపులను టోల్ ప్లాజాలో అంగీకరించరు. యూపీఐ ద్వారా చెల్లించే వాహనాలకు అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఫాస్టాగ్ ఉన్న వాహనాలను మాత్రమే నేటి నుంచి అనుమతించనున్నారు.
ఫాస్టాగ్ ఉన్న వాహనాలకే...
అలాగే యూపీఐ ద్వారా చెల్లించే వారికి టోల్ ఫీజు మొత్తంలో 1.25 రెట్ల రుసుము అధికంగా వసూలు చేయనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రకటించింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు విధిగా ఫాస్టాగ్ ను వినియోగించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ ప్రక్రియను నేటి నుంచి చేపట్టినట్లు తెలిపింది.
Next Story

